Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
Welcome to Gowtham Jai Bheem Abhinava Yuvasena Sangham Official Website.Thank You for visiting us.Your Suggestions are always welcome.Please mail us at Gjboys4u@Gmail.com.In case of any query about website contact Mr.Suresh Urla at urlasurace@gmail.com

Ambedkar thoughs

మా ప్రియతమ నాయకుడు భారత రత్న డా.బి.ఆర్ .అంబేద్కర్  గారి అశయసాదనే ద్యేయంగా ముందుకు సాగుతూ ఆయన ఆలోచనలలో కొన్ని  మీకు అందిస్తున్నాం .                            -  Gjboys,Nathavaram 








స్త్రీ-పురుషులు ఇద్దరూ విద్యావంతులైన నాడే సమాజం పురోగమిస్తుంది.
                                     -డా.బి.ఆర్.అంబేద్కర్.



కుల వ్యవస్థ లో అందరూ బానిసలే ,కాని ఈ బానిసలందరికీ సమాన హొదా లేదు .                         -డా.బి.ఆర్.అంబేద్కర్.








కులం పునాదుల మీద మీరు ఒక జాతిని నిర్మించలేరు,నీతిని నిర్మించలేరు.
                                     -డా.బి.ఆర్.అంబేద్కర్.










తమ జాతికి సమాజానికి సేవ చేసే చైతన్యాన్నిపెంపొందించుకోవాల్సింది  గా నేను విద్యార్ధులకు,యువత కు విజ్ఞప్తి చేస్తున్నాను.రాబోయే కాలంలో జాతి సమైక్యాన్ని మోయ్యల్సిన బాద్యత మీదే .
                            -డా.బి.ఆర్.అంబేద్కర్.











బానిసత్వం తో పోలిస్తే అస్పృస్యత మరింత క్రూరమైనది.
                                         -డా.బి.ఆర్.అంబేద్కర్.











కుల వ్యవస్థ సమ విభజనే కాదు,అది శ్రామికుల విభజన కూడా.
                                   -డా.బి.ఆర్.అంబేద్కర్











సంపదను పంచి ప్రతీ వ్యక్తి ని ఆనందింపజేయడం కాదు,సమాజం లో వ్యక్తుల మధ్య ఉన్న అంతరాలను పోగొట్టడమే మన ముందు ఉన్న సమస్య .  
                              -డా.బి.ఆర్.అంబేద్కర్.









దుఖా:నికి కారణం పేదరికం ,కాని పేదరిక నిర్మూలన ద్వారానే సంతోషం లభించదు,అత్యున్నత జీవన పద్ధతి వాళ్ళ కాక, అత్యున్నత జీవన విధానం వల్లనే సంతోషం లభిస్తుంది.
                                   -డా.బి.ఆర్.అంబేద్కర్. 










ఇతర మతాలలో 'దేవుని' స్థానం ఎంత ఉన్నతమైనదో,బౌద్ధం లో 'నైతిక విలువ' స్థానం కూడా అంతే గొప్పది.
                                            -డా.బి.ఆర్.అంబేద్కర్.










బుద్దున్ని ఏ మత బోధకునితోనూ సరిపోల్చలేము.ఆయన బోధనలు ప్రజల సాంఘిక జీవనాన్ని స్ప్రసించాయి.ఆయన సిద్దాంతాలు ఆధునికమైనవి.మరణించిన తర్వాత స్వర్గం లో మానవ విముక్తి గురించి కాక ఈ  భూ లోకం లో మాన వ విముక్తి గురించి ఆయన బోధించారు.
                                     -డా.బి.ఆర్.అంబేద్కర్.  










విద్యార్థులారా ..!! దేన్నైనా అమ్ముకోండి,ఆత్మాభిమానాన్ని అమ్ముకోవద్దు.
                  -డా.బి.ఆర్.అంబేద్కర్.












పోగొట్టుకున్న హక్కులు అడుక్కోవడం ద్వారా సాధించుకోలేము.దోపిడీదారులను ప్రార్థించడం ద్వారా హక్కుల్ని పొందలేము.'నిరంతర పోరాటమే' హక్కుల సాధనకు మార్గం.మేకల్నే కాని సింహాల్ని బలి ఇవ్వరు.
                                      -డా.బి.ఆర్.అంబేద్కర్. 











స్వేచ్చాయుతమైన ఆలోచనకు ,స్వేచ్ఛాయుత ఆలోచన యొక్క ఆచరణకు 'వ్యక్తిగత ఆస్తి'ఒక పెద్ద అడ్డంకి
                                       -డా.బి.ఆర్.అంబేద్కర్.












ఆత్మ గౌరవాన్ని,దేశం పట్ల ప్రేమని కోల్పోయి జీవించే జీవితం కంటే అవమానకరమైన జీవిత వేరొకటి ఉండదు.
                                    -డా.బి.ఆర్.అంబేద్కర్.











ఏమీ చెయ్యకుండా  'ఓక్' చెట్టులా కలకాలం జీవించే కంటే ,ఒక గొప్ప పని కోసం యవ్వనం లో చనిపోవడం చాల గొప్ప విషయం.
                                 -డా.బి.ఆర్.అంబేద్కర్.






సాంఘిక ,ఆర్ధిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు.
                     -డా.బి.ఆర్.అంబేద్కర్.











మతం సక్రమంగా ఉండాలంటే అది హేతువు తో ఏకీభవించాలి.హేతువు అంటే నా దృష్టిలో సైన్స్. 'హేతువాదం'లేని శాస్త్రం ఎంత  గొప్పదైన అది నిరుపయోగం.
                                 -డా.బి.ఆర్.అంబేద్కర్.











పీడిత ప్రజలు తమ హక్కులను 'స్వయం కృషి' ద్వారా మాత్రమే సాధించుకోగలరు.
                      -డా.బి.ఆర్.అంబేద్కర్.
దేశ బావిష్యత్తు విద్యార్థుల పైనే ఆధారపడి ఉంది,జాతిలో విదార్ధులు మేదావి వర్గం ,వారు మాత్రమే ప్రజాభిప్రాయాన్ని రూపొందించగలరు.
    -డా.బి.ఆర్.అంబేద్కర్. 








మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి.అందుకై  దేవుడి మీద కాని ,మహానుభావుల మీద కాని ఆధారపడవద్దు.తీర్ద యాత్రల ద్వారా,ఉపవాసాల ద్వారా విముక్తి కలగదు.మత గ్రంధాల పట్ల భక్తి మిమ్మల్ని వెట్టి చాకిరీ నుండి ,పేదరికం నుండి రక్షించ లేదు.   -డా.బి.ఆర్.అంబేద్కర్.









'శీలం',   'మానవత్వం '  లేని విద్యావంతుడు క్రూర మృగం కంటే ప్రమాదకరమైనవాడు.
                     -డా.బి.ఆర్.అంబేద్కర్.







బుద్ధుడు స్త్రీ -పురుష సమానత్వం గురించి గొప్పగా బోధించాడు.
                                   -డా.బి.ఆర్.అంబేద్కర్.




స్త్రీ జాతి యొక్క అభివృద్ధి లోనే  సమాజాభివృద్ధి ఉందని నా విశ్వాసం.
                       -డా.బి.ఆర్.అంబేద్కర్. 












కుల భూతాన్ని చంపకపోతే రాజకీయ సంస్కరణలు,ఆర్ధిక సంస్కరణలు విఫలమౌతాయి.
-డా.బి.ఆర్.అంబేద్కర్.





సంపదను అందరూ సమానంగా అనుభవించడానికి, ఆర్ధిక అసమానత్వం నిర్మూలించడానికి భూసంస్కరణలు  వెంటనే ప్రవేశ పెట్టాలి .
-డా.బి.ఆర్.అంబేద్కర్.





పూర్ణ జ్ఞానమే పూర్ణ శక్తి.ఆ శక్తి ని అందుకోవడానికి నిరంతరం శ్రమించాలి 
-డా.బి.ఆర్.అంబేద్కర్.






దళిత విద్యార్డులారా ..! మేల్కొనండి ,కదలండి ,సమైక్యం కండి ,శ్రమించండి ,ఉద్యమించండి.మీకు లభ్యమైన అవకాశంతో, శక్తి సమర్ద్యాలలో,మేధా సంపత్తి లో ఇతరులకు తీసిపోమని నిరూపించండి .కేవలం వ్యక్తిగత సుఖభోగాల కోసం జీవితాన్ని కొనసాగిస్తున్నామని కాక ,జాతినంతా బానిసత్వం నుండి విముక్తి చెయ్యడానికి ,సమాజంలో గౌరవింపబడడానికి ,శక్తివంతంగా  తయారు చేయడానికి ,పేదవానికి చేయూత నివ్వడానికి  శ్రమిస్తున్నామని   నిరూపించండి.-   డా.బి.ఆర్.అంబేద్కర్. 



జై భీమ్...జై భీమ్...జైజై భీమ్...!!!!

                                     -Collected& published by
                   Gjboys,Nathavaram.


No comments:

Post a Comment