Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
Welcome to Gowtham Jai Bheem Abhinava Yuvasena Sangham Official Website.Thank You for visiting us.Your Suggestions are always welcome.Please mail us at Gjboys4u@Gmail.com.In case of any query about website contact Mr.Suresh Urla at urlasurace@gmail.com

భుద్ద జై భీమ్



డా.బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు .



Dr.B.R.AMBEDKAR (1891-1956)


B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law.

     





















1891: April 14న రాంజీ మాలోజి సక్పాల్ , భీమాబాయి  దంపతులకు ఇప్పటి మధ్యప్రదేశ్ లోని "మౌ" పట్టణం లో జన్మించారు.




అంబేద్కర్ తండ్రి రాంజీ మాలోజి సక్పాల్ .
                                     






1908:బొంబాయి లో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో మెట్రిక్యులేసన్ పూర్తి చేసారు. 















1905:14వ యేట రామాభాయితో వివాహం జరిగింది 






1913:బరోడా రాజు ఆర్ధిక సహాయంతో ఉన్నత విద్య నిమిత్తం అమెరిఅకా లోని కొలంబియా యూనివర్సిటీ కి వెళ్ళారు . 








1916:ఆర్ధిక శాస్త్రంలో M.A. డిగ్రీ నిమిత్తం 'ప్రాచీన భారత వాణిజ్యం' అనే గ్రంధాన్ని రచించారు.National devidents of India అనే అంశంపై పరిశోధించి PHD   పొందారు. 


























1917: బరోడా సంస్థాన మిలిటరీ సెక్రటరీగా అంబేద్కర్ కొంత కాలం పనిచేసారు.







1918-20: బొంబాయి లో సిడేన్ హోం కళాశాలలో ఆర్ధిక,శాస్త్ర,వాణిజ్య శాస్త్ర బోధకునిగా పనిచేసారు.


















1919:సౌత్ బరో ఎన్నికల సంస్కరణల కమిటీ ముందు హాజరై  రాజకీయ హక్కుల కొరకు తన వాదనను వినిపించారు.
















       
1920:జూన్ లో 'మాక్ నాయక్' అనే మరాఠీ పక్ష పత్రిక ను స్థాపించారు.








1920-23:లండన్ లోని లాస్కీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వారు అంబేద్కర్ కు MSc డిగ్రీని  'The Provential de centralization British Finance in India' అనే అంశం పై ప్రధానం చేసారు.








     


1923: గ్రౌయిన్స్ విశ్వ విద్యాలయం నుండి Bar at Law(బారిస్టర్)పట్టబద్రులయ్యారు. 'Problem of Rupee' అనే అంశంపై అయన సమర్పించిన పరిశోధనా సిద్దాంత గ్రంధానికి DSc డిగ్రీ పొందారు.
   









 
1924:జూన్ లో బొంబాయి హైకోర్టులో న్యాయవాద వృత్తిని ఆరంభించారు.నిమ్న జాతుల అభ్యున్నతికి బహిస్కృత హితకారిణి సభను ఏర్పాటుచేశారు.










1925-30 :అస్పృశ్య  విద్యార్థులకై  బోంబే ప్రావిన్సు లో  నాలుగు వసతి గృహాలను స్థాపించారు.










1926-34 :బొంబాయి శాసన సభలో నామినేట్ సభ్యుడయ్యారు.











1927:ఏప్రిల్ నెలలో 'బహిష్కృత భారత్' అనే పక్ష పత్రికను ప్రారంభించారు.డిసెంబర్ నెలలో చెరువు పోరాటం,డిసెంబర్ 25 న దేశంలోని కోట్లాది పీడితుల హక్కులను నిషేధించిన 'మనుష్కృతి' ని బహిరంగంగా దగ్దం చేసి పీడిత జనుల స్వేచ్చకై పోరాటాన్ని ప్రారంభించారు.











1928: బొంబాయి ప్రభుత్వ 'లా' కళాశాలలో ప్రొఫెసర్ గానూ,అనతి కాలం లోనే  కళాశాల ప్రిన్సిపాల్ గానూ  పదవులు చేపట్టారు .సెప్టెంబర్ నెలలో 'సమాజ్ సమతా సంఘ్' అనే సంస్థను స్థాపించి కుల హిందుల,అస్పృశ్యుల మధ్య సాంఘిక సమానత్వాన్ని బోధించడం ప్రారంభించారు.










1929-30:మార్చి నెలలో సమాజ సేవకు,కులపీడనకు వ్యతిరేఖంగా 'సమతా సైనిక దళం'ని ప్రారంభించారు.జనతా వార పత్రికను స్థాపించారు.లండన్ లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.















1931-32:రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అస్పృశ్యులకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని ప్రతిపాదించారు.ఆంగ్లో ఇండియన్స్ కు ,యురోపెయన్ లకు,క్రైస్తవులకు ,ముస్లింలకు,ట్రేడర్లకు ,అస్పృశ్యుల కు నియోజక వర్గాలు కేటాయించారు.గాంధి ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు .దేశ వ్యాప్తం గా తీవ్ర వత్తిడి వచ్చిన కారణంగా అంబేద్కర్ ప్రత్యేక నియోజక వర్గాలను వదులుకొని సెప్టెంబర్ 24 న 'పూనా ఒప్పందం ' ఒప్ప్పుకోవాల్సి వచ్చింది.













1935:  జ్యూరీష్ ప్రుడేన్స్('లా'లో) ప్రొఫెసర్ గా పనిచేసారు .














1936:అక్టోబర్ 13 న నాసిక్ జిల్లాలో 'యెలా' లో జరిగిన బహిరంగ సభలో అంటరాని వారు హిందు మతాన్ని విడనాడి మతాన్ని మార్చుకోవాలన్న  చారిత్రాత్మక పిలుపునిచ్చి 'ఇండిపెండెంట్ లేబర్ 'పార్టీ ని స్థాపించారు.











1937-41:బొంబాయి శాసన సభ సభ్యునిగా పనిచేసారు.













1939: 'ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్' రచన గావించారు.










1940:'పాకిస్తాన్ పై ఆలోచనలు 'అనే గ్రంధాన్ని  ప్రచురించారు.












1942:ఏప్రిల్ లో 'అఖిల భారత షెడ్యూల్ కులాల సమాఖ్య ' అనే రాజకీయ పార్టీ ని స్థాపించారు.






1942-46:వైస్రాయి కౌన్సిల్ లో కార్మిక సభ్యునిగా పనిచేసారు.నిమ్న జాతులకు విద్య ,ఉద్యోగ అవకాశాలను కల్పించారు .










  
1943:రెనడే-గాంధీ -జిన్నా' గ్రంధాన్ని ప్రచురించారు.లేబర్ అండ్ పార్లమెంటరీ డెమోక్రసీ వ్యాసాన్ని రచించారు.











1946:మైనార్టీల నాయకుని గా అంబేద్కర్ ను బ్రిటిష్ కౌన్సిల్ కాబినెట్ ఇంటర్వ్యూ చేసింది.స్వాతంత్ర్యం పైనా,నిమ్న జాతుల అభివృద్ధి పైనా అంబేద్కర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.












1946:మధ్యంతర ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ సబ్యునిగా ఎన్నికయ్యారు .పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సిద్దార్ధ కళాశాల స్థాపించారు. 





1946:ఆగష్టు 15న నెహ్రూ మంత్రివర్గంలో 'నాన్-కాంగ్రెస్' సభ్యునిగాన్యాయశాఖ మంత్రిత్వాన్ని స్వీకరించారు.
ఆగష్టు 29న  భారత రాజ్యంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయ్యారు. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులలో ఆయనొక్కరే రాజ్యాంగ రచన పూర్తి చేసారు.











  










 1951:హిందు కోడ్ బిల్లు ప్రవేశపెట్టారు.ఫిబ్రవరి లో దీన్ని పార్లమెంట్ లో చర్చకు స్వీకరించారు .












1952:రాజ్యసభకు ఎన్నికై చివరి వరకు కొనసాగారు.జూన్ లో కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లాస్(LLD)గౌరవ పురష్కారం  లభించింది.










1953:ఔరంగబాద్ లో మిలిండా మహావిద్యాలయ కళాశాల స్థాపించారు.ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ అఫ్ లిటరేచర్(D.Lt)పురస్కారం లభించింది.














         1954:బర్మాలోని రంగూన్ ప్రపంచ బౌద్ద సభకు హాజరయ్యారు.


















           1955: 'అఖిల భారత బౌద్ద మహాసభ ' ప్రారంభించారు .
భాషా రాష్ట్రాల పై ఆలోచనలు అనే గ్రంధాన్ని ప్రచురించారు.



              






          1956:2,500 వ బౌద్ద వర్ధంతి సందర్భంగా నాగపూర్ లోని 14 ఎకరాల దీక్షా మైదానం లో 5 లక్షల మంది అనుచరులతో హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా  బౌద్ద మతాన్ని స్వీకరించారు. 'భారతీయ రిపబ్లికన్ పార్టీ' ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభించారు .









           1956: డిసెంబర్ 6 న మహా పరినిర్యాణ౦ చెందారు.






           






          కోట్ల భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రగా ,మహోన్నత నాయకునిగా ,మేధా సంపన్నుడి గా  నిలిచిపోయారు.
ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. జై భీమ్..!
        -గౌతమ్ జై భీమ్ అభినవ యువసేన సంఘం.
--------------***------------***----***-----------------------







DR BR AMBEDKAR

More PowerPoint presentations from dhairya nagpal

                  

                         గౌతమ్ బుద్ధుడు 

బుద్ధం శరణం  గచ్ఛామి ధర్మం శరణం   గచ్ఛామి సంఘం శరణం  గచ్ఛామి  
బుద్ధుడు..!ఈ పేరు మదిలో కి రాగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ధ్యాన ముద్ర లో ఉన్న భోధి సత్వుడి నిర్మల రూపం మనకు గుర్తుకు వస్తుంది .అహింసా సిద్ధాంతం  గుర్తుకు వస్తుంది.జీవికి కష్టాలెందుకు? అని ఆలోచించి ,అన్వేషణ మొదలుపెట్టిన గొప్పతనం జ్ఞాపకాని కి వస్తుంది.చింతలన్నింటికి కోరికలే కారణం అని నిగ్గు తేల్చిన  అపూర్వ మేదస్సు సాక్షాత్కరిస్తుంది .శాంతం తో కోపాన్ని ,సాత్వికత తో హింసను దానం తో లోకాన్ని ,ప్రేమ తో ద్వేషాన్ని ,సత్యం తో అసత్యాన్ని జయించండి .సర్వ ప్రాణుల పట్ల సానుభూతి ని కలిగి ఉండటమే నిజమైన ధర్మం ,మతమని ప్రపంచానికి చాటిన మహానీయుడు .అందుకే ఆయన జన్మించి 2500 ఏళ్ళు గడిచినా, ఆయన చూపిన మార్గం  ఇంకా అప్రతిహతంగా  సాగిపోతుంది .
   
గౌతమ బుద్ధుడి అసలు పేరు  సిద్డార్తుడు.  క్రీ.పూ. 563 లో శుద్దోదనుడు,మహా మాయాదేవి  దంపతులకు కపిలవస్తు సమీపంలో లుంబిని గ్రామంలో జన్మించాడు.రాచ కుటుంబం లో పుట్టిన ఆయన కొన్నేళ్ళ పాటు సకల సుఖాలను అనుభవించాడు .యశోధరను వివాహమాడాడు .వారికి రాహులుడు అనే కుమారుడు ఉన్నాడు.ఒకరోజు ఆయన వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన వృద్ధుడి ని , రోగిని ,మృతదేహాన్ని చూసాడు .ఇది ఆయన మదిలో కలతను మిగిల్చింది.ఈతి బాధలను గూర్చి ఆయనకు తెలియ వచ్చింది.దు:ఖానికి కారణాన్ని వెతకాలని నిశ్చయించుకున్నాడు .అదే సకల సౌక్యాలను ,కుటుంబాలను త్యజించి ,సన్యాసి గా మారాడు .దేశాటన చేస్తూ గయకు సమీపం లో ని నిరంజన తటాకం వద్దకు చేరాడు.క్రీ.పూ.531 వ సంవత్సరం లో రావి చెట్టు (బోధి చెట్టు)  కింద కూర్చొని కొన్ని రోజుల పాటు ధ్యానం లో  మునిగిపోయాడు.శరీరం శుస్కించినా ,చర్మం ,ఎముకలు,మాంసం కరిగిపోయినా ,జ్ఞానోదయం కానిదే ధ్యానం నుంచి కదల రాదని గట్టిగా తీర్మానించుకున్నాడు.ఆయన ఆశయం సిద్ధించి జ్ఞానోదయం అయ్యింది .ఈతి బాధల నుండి  జ్ఞానోదయం అయ్యింది.అప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు .                     ఇదే "నా చివరి జన్మ, ఇక ముందు నాకు ఎలాంటి జన్మలూ ఉండవు" అన్నవి ఆయన తొలి మాటలుగా చెబుతారు.ఆ తర్వాత సారానాద్ చేరుకొని తొలిసారిగా శిష్యుల కు ఉపదేశం చేసాడు.దీనిని "ధర్మ చక్ర  పరివర్తనం" అంటారు. అప్పటి నుంచి తన ప్రవర్తన తో,తన ప్రవచన, ప్రభోదనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు .    
బుద్ధం శరణం  గచ్ఛామి ధర్మం శరణం   గచ్ఛామి సంఘం శరణం  గచ్ఛామి
ప్రతి ఒక్కరు ఈ మూడు సూత్రాలను అనుసరించాలని హితవు చెప్పాడు.కోరికలే దు:ఖాని కి కారణం అని తేల్చాడు .వాటిని ఎలా జయించాలో శోదించాడు.సృష్టిలో ఏది శాశ్వతం కాదని ,మంచి చెడు ఏదైనా వచ్చి  పోయెవని చెప్పారు.                                                   సుత్త,వినయ ,అభిదమ్మ  అనే 3 పిటకాలను బుద్హుడు అందించాడు .ఇవన్ని పాళీ భాష లో ఉన్నాయి .బౌద్ధులు ఆచరించాల్సిన  జీవన విదానాలను ఇందులో పొందు పరిచారు.జీవ హింస చేయరాదు,అబద్దం ఆడరాదు ,ఇతరుల ఆస్తిని ఆశించరాదు,ముక్త పానీయాలను  సేవించరాదు ,అవి నీతి పనులు చేయరాదు అనే పంచ శీల సూత్రాలను భోధించారు.నీతి నియమాలతో కూడిన అష్టాంగ మార్ఫ్గాన్ని  సూచించారు.ఇందులో సరైన ద్రుష్టి,సత్య సంకల్పం ,సత్య వాక్కు ,సత్కర్మ ,సత్య జీవనం ,సత్య యత్నం ,సత్య లక్ష్యం  అనే 8 విధాలు ఉంటాయి.క్రీ.పూ.483 లో కుశీ నగరం లో కాకుస్థ నదీ తీరాన బుద్హుడు మహా పరి నిర్వాణం చెందాడు .ప్పాడు .ఈ అశాశ్వత సిద్దాంతాన్ని అర్ధం చేస్కొని ,మేలు ,కీడు దేనికి పొంగి పోకుండా ,క్రుంగి పోకుండా తామరాకు పై నీటి బొట్టులా ఉండాలని బోధించాడు.అప్పుడు జీవితంలో దు:ఖానికి తావే ఉండదని తేల్చి చెప్పాడు .ఏ జీవిని హింసించ వద్దని హితవు పలికాడు.ఇంద్రియాలను నియంత్రణ లో ఉంచుకుంటూ ,కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలన్నాడు.మనస్సును శ్వాస మీద లగ్నం చేస్తే చింత ,చింతన ఉండదంటూ విపస్సనా పద్దతిని తేలిగ్గా భోదించాడు .ధ్యాన పద్ధతి ని అనుసరిస్తే కష్టం ,దు:ఖం తలెత్తవని చెప్పాడు. 
                                                                                
"సంయోగ ద్రవమంతా నశిస్తుంది.జ్ఞానం పొందాడానికి  తీవ్రంగా  ప్రయత్నిచండి " అన్నవి బుద్హుడి చివరి వాక్కులు.                     అనేక మతాల అహింసను ప్రభోధించుటకు బుద్హుడే ప్రేరణ.

No comments:

Post a Comment